తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో భక్త కన్నప్ప.. దేవుడికి నాలుకను నైవేద్యంగా సమర్పించిన వృద్ధుడు - యూపీ​లో మూఢనమ్మకంతో నాలుకను కోసుకున్న వ్యక్తి

దేవుడిపై తనకున్న అపారమైన భక్తిని వినూత్నంగా చాటుకున్నాడు ఓ భక్తుడు. ఏకంగా తన నాలుకనే కోసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఫతేపుర్​ జిల్లాలో జరిగింది.

Devotee offered his tongue in up fathepur
ఫతేపుర్​లో నాలుకును కోసుకున్న భక్తుడు

By

Published : Mar 28, 2023, 8:47 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఫతేపుర్​ జిల్లాకు చెందిన ఓ భక్తుడు దేవుడిపై తనకున్న అపారమైన భక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. ఏకంగా తన నాలుకనే కోసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాడు. వృద్ధుడు చేసిన ఈ పనితో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనతో భక్తులు దేవి ఆలయానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ఫతేపుర్​కు చెందిన 65 ఏళ్ల బాబురామ్​ పాశ్వాన్​.. నవరాత్రి సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని గుగౌలి గ్రామ సమీపంలోని శివభవాని మాత ఆలయానికి దర్శనం కోసం వెళ్లాడు. అమ్మవారిని దర్శించుకునే క్రమంలో బాబురామ్​ తన నాలుకలోని సగభాగాన్ని కోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాడు. నాలుకను గాయపరుచుకున్న అనంతరం ఆ వృద్ధుడికి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కళ్యాణ్‌పూర్ పోలీసులు శివభవాని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం రక్తపుమడుగులో ఉన్న వృద్ధుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాబురామ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నీరజ్ యాదవ్ తెలిపారు.

నాలుక కోసుకున్న వృద్ధుడి కుమారుడు

ఇక ఈ వార్త కాసేపటికే ఆ గ్రామ చుట్టుపక్కల వారికి వ్యాపించింది. దీంతో గ్రామస్థులు ఈ ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే బాబురామ్ పాశ్వాన్ చాలా కాలం పాటు శివభవాని ఆలయంలో పూజారిగా ఉన్నారని గ్రామస్థులు చెబుతున్నారు.

"నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ వివిధ రకాల విశ్వాసాలు, నమ్మకాలు మనకి కనిపిస్తుంటాయి. తమ కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు శివభవాని ఆలయంలో మొక్కలు చెల్లిస్తారు. కోరిక నెరవేరినందుకు బాబురామ్​ ఇలా చేసి ఉంటాడని మేము అనుకుంటున్నాము."

-- గ్రామస్థులు

మూఢనమ్మకాల మాటున ప్రాణాలు పణం..
సరిగ్గా ఇలాంటి ఘటనే గతేడాది జూన్​లో మధ్యప్రదేశ్​లో బడా గ్రామంలో వెలుగు చూసింది. ఓ ఆలయానికి వచ్చిన 20 ఏళ్ల యువతి అమ్మవారి ముందే తన నాలుకను తెగ్గోసుకుంది. అనంతరం నాలుక భాగాన్ని విగ్రహం పాదాల మీదకు విసిరేసింది. బడా గ్రామానికి చెందిన రాజ్​కుమారీ పటేల్ అనే యువతి గురువారం తల్లిదండ్రులతో కలిసి స్థానికంగా ఉండే అమ్మవారి ఆలయానికి వచ్చింది. గుడిలో పూజ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ యువతి తన నాలుకను కోసేసుకుంది. కోసిన ఆ భాగన్ని విగ్రహం పాదాల వద్ద విసిరింది. ఈ కథనం పూర్తి వివరాల కోసం ఈ లింక్​ను క్లిక్​ చేయండి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details