కర్ణాటకలో కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. రోజుకు 30 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతుండటం, 200 మందికిపైగా మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరగగా.. శ్మశానాల్లో సరిపడా స్థలం లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
హౌస్ఫుల్ బోర్డులు..
బెంగళూరు, చామ్రాజ్పేట టీఆర్ మిల్ శ్మశాన వాటికకు ఆదివారం మొత్తం 45 మృతదేహాలు వచ్చాయి. ఏకకాలంలో కేవలం 20 మృతదేహాలను దహనం చేసే వీలుంది. అంతకు ముందే 19 మంది అంత్యక్రియలకు బుకింగ్స్ ఉన్నాయి. దాంతో ఇకపై వచ్చే మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించలేమని నిర్ణయించుకున్న అక్కడి సిబ్బంది.. హౌస్ఫుల్ బోర్డు పెట్టారు.
హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటం వల్ల అంత్యక్రియలు జరిపేందుకు రోగుల బంధువులు ఒక శ్మశానం నుంచి మరో శ్మశానానికి తిరగాల్సిన దుస్థితి తలెత్తింది.