సాగు చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్న రైతుల్లో కొందరు ఎర్రకోటలోకి ప్రవేశించారు. అక్కడే జెండాలు ఎగరవేసి తమ నిరసన తెలిపారు.
ట్రాక్టర్ పరేడ్‌కు పోలీసులు అనుమతించిన దారులకు భిన్నంగా రైతులు ఇతర మార్గాల్లో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. రాజధానిలోని వివిధ సరిహద్దు ప్రాంతాల్లో బారికేడ్లను దాటుకుని రైతులు నగరంలోకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం జరిగిన ఈ నిరసల్లో రైతులను అదుపు చేయడానికి బాష్పవాయువును ప్రయోగించడం సహా లాఠీ ఛార్జ్ చేశారు.