స్నేహితులు సాయం చేశారు, ఇంకొందరు దాతలు డబ్బులు సమకూర్చారు. రెండు సార్లు కరోనా బారిన పడిన ఓ పోలీసు అధికారి చికిత్సకు రూ. 40 లక్షలు అందించారు. వైరస్‌ను జయించాడు. కానీ బ్లాక్ ఫంగస్ దాడి చేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
రెండుసార్లు కరోనాను జయించాడు.. కానీ! - ముంబయి
రెండుసార్లు కరోనా బారినపడి కోలుకున్న ఓ పోలీసు అధికారిపై బ్లాక్ దాడి చేసింది. బ్లాక్ ఫంగస్‌ను నయం చేసే మందులు ఆ ఆసుపత్రిలో అయిపోవడం వల్ల చికిత్స చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. దాంతో అతను ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
కరోనా
ఆయనే.. ముంబయికి చెందిన ఎస్ఐ భైదాస్ మాలీ. రెండు సార్లు కరోనా బారిన పడి కోలుకున్నారు. కానీ అతనికి బ్లాక్ ఫంగస్ సోకింది. ఈ శిలీంధ్ర వ్యాధికి మందులు లేవని ఆసుపత్రి వైద్యులు చేతులెత్తారు. దాంతో ప్రస్తుతం అతను ఆసుపత్రి బెడ్ మీదనే జీవన్మరణ పోరాటం చేస్తున్నాడు.
ఇదీ చదవండి:పెరుగుతున్న బ్లాక్‌ఫంగస్ కేసులు.. ఈఎన్టీలో పూర్తిస్థాయి వైద్యం
Last Updated : May 21, 2021, 7:22 AM IST