నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని భారత్, పాకిస్థాన్ సంయుక్త ప్రకటన విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ సహా ఇతర పొరుగు దేశాలతో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామని స్పష్టం చేసింది. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ద్వైపాక్షికంగా, శాంతియుత ధోరణిలో పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ శుక్రవారం తెలిపారు.
"పాకిస్థాన్‌తో సహా అన్ని పొరుగు దేశాలతో భారత్ సాధారణ సంబంధాలను కోరుకుంటోంది. భారత్, పాక్ మధ్య సమస్యలు ఏమైనా ఉంటే, ద్వైపాక్షికంగా, శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఇతర ముఖ్య విషయాలపై మా అభిప్రాయం మారదు.''