తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టాలు తప్పిన రైలు.. ఎదురుగా వస్తున్న ట్రైన్​ను ఢీకొని..

బంగాల్​లో పట్టాలు తప్పిన ఓ రైలు మరో లోకల్ ట్రైన్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు.

Derailed train hits another movement temporarily suspended in west bengal
పట్టాలు తప్పి మరో రైలును ఢీకొన్న ట్రైన్

By

Published : Nov 30, 2022, 4:30 PM IST

Updated : Nov 30, 2022, 5:25 PM IST

పట్టాలు తప్పి మరో రైలును ఢీకొన్న ట్రైన్

బంగాల్ సియాల్దా సమీపంలో బుధవారం ఉదయం రాణాఘాట్ లోకల్ రైలు పట్టాలు తప్పి.. మరో లోకల్ ట్రైన్​ను ఢీకొట్టింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఘటన జరిగిన వెంటనే రైలులోని ప్రయాణికులను దించేశారు. వారంతా రైల్వే లైన్ వెంబడి నడిచి ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నారు.

ప్రమాదం దృష్ట్యా అధికారులు ఆ మార్గంలో రైలు రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే ఇప్పటి వరకు ఏ రైలునూ రద్దు చేయలేదని స్పష్టం చేశారు. సిగ్నలింగ్​లో గందరగోళమే ప్రమాదానికి దారితీసిందని భావిస్తున్నారు. అసలు కారణమేంటో తేల్చేందుకు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశామని తూర్పు రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి ఏకలవ్య చక్రవర్తి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కోరినట్లు చెప్పారు.

Last Updated : Nov 30, 2022, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details