ఝార్ఖండ్ లాతేహార్(Latehar News) జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు(Maoist Encounter) జరిగాయి. ఈ కాల్పుల్లో డిప్యూటీ కమాండెంట్ ప్రాణాలు కోల్పోయారు.
ఝార్ఖండ్ జాగ్వార్ డిప్యూటీ కమాండెంట్ రాజేశ్ కుమార్‌కు(Jharkhand Encounter) బుల్లెట్ గాయాలుకాగా ఆయనను రాంచీలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. అప్పటికే రాజేశ్ మరణించినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఓ నక్సలైట్‌ను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. అతడి నుంచి ఏకే 47 సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.