తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జీన్స్​ వేసుకుందని బాలికను చంపేసిన కుటుంబీకులు - బాలిక హత్య

ప్రస్తుతం జీన్స్​ అనేది సర్వసాధారణం. ఆడ, మగ అనే తేడా లేకుండా వాటిని ధరిస్తున్నారు. అయితే.. ఆ అలవాటే ఓ బాలిక పాలిట శాపమైంది. జీన్స్​, టీషర్ట్స్​ ధరించినందుకు సొంత కుంటుబ సభ్యులే హత్య చేశారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ దేవరియా జిల్లాలో జరిగింది.

niece was beaten to death
బాలిక హత్య

By

Published : Jul 22, 2021, 9:00 PM IST

Updated : Jul 22, 2021, 10:16 PM IST

జీన్స్​ వేసుకుందని బాలికను చంపేసిన కుటుంబీకులు

ఉత్తర్​ప్రదేశ్​ దేవరియా జిల్లాలోని సావరేజీ ఖరగ్​ గ్రామంలో వంతెనకు బాలిక మృతదేహం వేలాడిన ఘటన కలకలం సృష్టించింది. జీన్స్​, టీషర్ట్స్​ ధరిస్తుందనే కారణంతో సొంత బాబాయ్​, తాత కలిసి చంపేశారు. నదిలో విసిరేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.

వంతెనకు వేలాడుతున్న బాలిక మృతదేహం

ఇదీ జరిగింది..

పంజాబ్​లోని లుధియానాలో 11వ తరగతి చదువుకుంటోంది 16 ఏళ్ల నేహ. తండ్రి ఉపాధి నిమిత్తం లుధియానాకు వలస వెళ్లాడు. అక్కడే నివసిస్తున్న బాలిక.. కొన్ని రోజుల క్రితం తల్లితో కలిసి తమ సొంతూరు యూపీలోని దేవరియా జిల్లా సావరేజీ ఖరగ్​కు వచ్చింది. తనకు జీన్స్​, టీషర్ట్​ వేసుకోవటం అలవాటు. సొంతూరులో కూడా తను అలాగే దుస్తులు ధరించేది. అది వారి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. నేహ తాత పరమహంస, బాబాయ్​ అరవింద్​.. అలాంటి బట్టలు వేసుకోవద్దని ఆమెను వారించేవారు. గ్రామంలో ఉన్నప్పుడు సాల్వర్​ ధరించాలని ఒత్తిడి చేసేవారు. గత కొన్ని రోజులుగా ఈ విషయమై ఇంట్లో బాలికకు వేధింపులు కొనసాగుతున్నాయి. గత మంగళవారం (జులై 20).. ఈ విషయంపై గొడవకు దిగారు. తీవ్రంగా చితకబాదారు. వారిని అడ్డుకునేందుకు బాలిక తల్లి శాకుంతల దేవి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నేహను ఆమె బాబాయ్​ అరవింద్​ విచక్షణారహితంగా కొట్టి బలంగా నెట్టటం వల్ల వెనకాల గోడకు తల తగిలింది. తీవ్ర రక్తస్రావంతో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఇదంతా చూసిన బాలిక తల్లి శాకుంతల దేవి పెద్దగా అరిచింది. చుట్టుపక్కలవారు మద్దతు ఇస్తారని ఆశించింది. ఈ క్రమంలోనే బాలికకు చికిత్స అందిస్తామని బొంకి అర్ధరాత్రి ఓ టెంపో మాట్లాడుకుని.. నిందితులు ఆసుపత్రికి తరలిస్తున్నట్లు నాటకమాడారు. ఘటనాస్థలం నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లి.. గ్రామం సమీపంలోని పటన్వా వంతెన పైనుంచి నదిలోకి విసిరేశారు. కానీ, ఆమె మృతదేహం వంతెన రెయిలింగ్​లో చిక్కుకుంది. ఉదయం అటుగా వెళ్లిన కొందరు వంతెనకు వేలాడుతున్న బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వంతెనపై పరిశీలిస్తున్న పోలీసులు

బాధిత బాలిక తల్లి శాకుంతల దేవీ మహువాడిహ్​ పోలీస్​ స్టేషన్​లో గురువారం ఫిర్యాదు చేసింది. జీన్స్​, టీషర్ట్స్​ వేసుకున్నందుకే.. బాలిక బాబాయ్​, తాత.. తీవ్రంగా కొట్టి హత్యా చేశారని ఆరోపించింది.

కేసు నమోదు చేసిన పోలీసులు.. నేహ తాత పరమహంస, బాబాయ్​ అరవింద్​లతో పాటు టెంపో డ్రైవర్​ హసనైన్​ను అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి:కట్నం తేనందని భార్యతో యాసిడ్ తాగించిన భర్త!

Last Updated : Jul 22, 2021, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details