మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని తన స్నేహితులిద్దరిని కత్తితో గాయపరిచిన ఓ 17 ఏళ్ల బాలుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గాయపడిన ఇద్దరు దిల్లీ సమీపంలోని బిందాపుర్కు చెందిన సందీప్, ఓంలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు నిందితుని వెంట మరో ఇద్దరు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఈ దాడిలో గాయపడిన సందీప్ అనే యువకుడి శరీరంలో 7 కత్తిపోట్లు దిగినట్లు అధికారులు తెలిపారు. చేతికి, నడుముపై ప్రధానంగా గాయాలైనట్లు పేర్కొన్నారు. అయితే అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. మరో యువకుడు ఓం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారని వివరించారు. జులై 24న దిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..