పెద్ద నోట్ల రద్దు చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో నల్లధనం అరికట్టేందుకు, పన్ను చెల్లింపులు పెరగటానికి, క్రమబద్ధీకరణకు తాము చేపట్టిన నోట్ల రద్దు సాయపడిందన్నారు. అలాగే.. పన్ను చెల్లింపుల్లో పారదర్శకతకు ఊతమిచ్చిందని తెలిపారు.
నోట్ల రద్దు వల్ల కలిగిన ప్రయోజనాలను తెలియజేస్తూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఈ ఫలితాలు దేశాభివృద్ధికి ఎంతోగానే ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. నోట్ల రద్దు ద్వారా ఏ విధంగా పన్ను చెల్లింపులు పెరిగాయి, పన్నులు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఎలా ఉపయోగపడిందనే అంశాల్ని సూచించే వివిధ గ్రాఫ్‌లను ట్విట్టర్లో పంచుకున్నారు మోదీ.
అవినీతి, నల్లధనంపై దాడి: భాజపా