తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ల్యాబ్​లో చీప్​గా వజ్రాలు తయారీ.. సూపర్ బిజినెస్! - diamond accessories

Diamond accessories: సూరత్​లో ల్యాబ్​లో తయారవుతున్న వజ్రాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మొబైల్ ఫోన్ కవర్లు, సన్​ గ్లాసెస్, బెల్టులు, బ్రాండ్​ లోగోలను వీటితో మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. డిజైన్లు కూడా ప్రత్యేకంగా ఉండటం వల్ల వినియోగదారులు ఏ మాత్రం ఆలోచించకుండా ఎంత ధర అయినా వెచ్చిస్తున్నారు.

Lab Grown Diamond Embedded Accessories
ఐఫోన్ కవర్ రూ.2.5లక్షలు.. ఈ వజ్రాలతో అదిరే లుక్​

By

Published : Jun 16, 2022, 4:53 PM IST

Updated : Jun 16, 2022, 6:25 PM IST

ఫోన్​ కవర్ రూ.2.5లక్షలు.. ఈ 'ల్యాబ్​ వజ్రాల'తో అదిరే లుక్​!

Lab grown diamond: గుజరాత్ సూరత్​లోని ప్రయోగశాలలో తయారవుతున్న వజ్రాలకు ఇప్పుడు ఫుల్​ ​ డిమాండ్ ఉంది. అసలైన వజ్రాలకు దీటుగా ఇవి పోటీ పడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. వీటిని చూసినవారు కచ్చితంగా 'వావ్' అనకుండా ఉండలేరు. ఇంతకీ ఈ కృత్రిమ వజ్రాల ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.

Diamond Embedded Accessories: ఖరీదైన వస్తువులు కొనేవారు వాటికి యాక్సెసరీస్​ కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ధర గురించి ఆలోచించరు. ఇలాంటి కస్టమర్లనే దృష్టిలో ఉంచుకుని సూరత్ వ్యాపారులు కృత్రిమ వజ్రాలతో అద్భుతమైన యాక్సెసరీస్ తయారు చేస్తున్నారు. నిజమైన వజ్రాలు అలంకరించినట్లు ఇవి మిలమిల మెరిసిపోతుంటాయి.

మొబైల్ కవర్లు, సన్ గ్లాసెస్, బెల్టు బకెల్స్​, స్మార్ట్ వాచ్​లు, సాధారణ వాచ్​లు, తాళాలు వంటి వాటిని ల్యాబ్​లో తయారైన వజ్రాలతో మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. కార్ల బ్రాండు లోగోలు, చైన్లు, బ్రేస్​లెట్లను కూడా కృత్రిమ వజ్రాలతో అలంకరిస్తున్నారు. ఒరిజినల్​ వజ్రాలతో పోల్చితే కృత్రిమ వజ్రాల ధర చాలా తక్కువే అయినప్పటికీ.. వీటిని అలంకరించిన యాక్సెసరీస్ ధర మాత్రం భారీగానే ఉంటుంది. రూ.7లక్షలు ఖరీదైన వాచ్​ను కృత్రిమ వజ్రాలతో అలంకరిస్తే దాని ధర రూ.14లక్షలు అవుతుంది.

ఐఫోన్ కవర్ రూ.2.5లక్షలు.. ఈ వజ్రాలతో అదిరే లుక్​

అలాగే ఐఫోన్ వంటి ప్రీమియం మొబైళ్ల కవర్లను రూ.2.5లక్షలకు విక్రయిస్తున్నారు సూరత్ వజ్రాల వ్యాపారులు. మేలిమి బంగారంతో పాటు వందల సంఖ్యలో కృత్రిమ వజ్రాలను ఉపయోగించడం వల్లే ఈ యాక్సెసరీస్​కు అంత ఎక్కువ ధర అని చెబుతున్నారు. వీటి డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే భారత్​తో పాటు అమెరికా వంటి విదేశాల్లోనూ వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఖర్చు గురించి ఏమాత్రం ఆలోచించని వారు వీటి కోసం ఆర్డర్లు చేస్తున్నారు.

ఐఫోన్ కవర్ రూ.2.5లక్షలు.. ఈ వజ్రాలతో అదిరే లుక్​

ఇదీ చదవండి:130ఏళ్ల చెట్టుపై 'మెర్క్యూరీ' దాడి.. నలుగురు డాక్టర్ల స్పెషల్ ట్రీట్​మెంట్​తో...

Last Updated : Jun 16, 2022, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details