దేశం ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి బయటపడుతుందనుకుంటుంటే.. కొవిడ్-19 కంటే ప్రమాదకరమని భావిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ తరహా కేసులు పలు రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. ఇదే ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది.
జూన్ 15వరకు మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లో 40కి పైగా డెల్టా ప్లస్ కేసులను గుర్తించారు. వేగంగా విస్తరించే అవకాశం ఉన్న డెల్టా వేరియంట్‌ను.. 174కుపైగా జిల్లాల్లో గుర్తించగా, దీనిలోనే రూపాంతరం చెందిన డెల్టా ప్లస్.. 10 రాష్ట్రాల్లోని 48 నమూనాల్లో వెలుగుచూసింది.
మరి.. ఈ డెల్టా ప్లస్ గురించి మీకెంత వరకు తెలుసు. కొంత ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన ఈటీవీ భారత్.. ఆ విషయాల్ని మీకు అందిస్తోంది.
డెల్టా ప్లస్ అంటే?
డెల్టా వేరియంట్లో మ్యుటేషన్ కారణంగా పుట్టుకొచ్చిన కరోనా రకం. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ బులెటిన్ ప్రకారం.. జూన్ 11న భారత్‌లో తొలిసారి వెలుగుచూసింది. ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారిలోనే ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు.
డెల్టా వేరియంట్ ఎందుకు భిన్నం?
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. స్పైక్ ప్రొటీన్ మ్యుటేషన్లు.. డెల్టాను వేగవంతమైన, ప్రమాదకరమైన వేరియంట్‌గా మార్చాయి.
డెల్టా వేరియంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
డెల్టాను బి.1.617.2 అని కూడా పిలుస్తున్నారు. ఇది వైరస్(అంటువ్యాధి) సంతతికి చెందిందే. ఏప్రిల్-మేలో భారత్‌లో కరోనా తీవ్ర దశలో ఉన్నప్పుడే ఇది వెలుగుచూసింది.
ఇది మరింత ప్రమాదకరమా?
డెల్టా వేరియంట్ బారినపడ్డవారు.. ఆస్పత్రిలో చేరే ప్రమాదం ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఇంకా పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ అధ్యయనం ప్రకారం యూకే స్ట్రెయిన్(అల్ఫా) కంటే.. 60 శాతం వేగంగా ఇది వ్యాపిస్తోంది. వ్యాక్సిన్లనూ తట్టుకొనే సామర్థ్యం ఉందంట.
వేగంగా విస్తరిస్తోందా?