తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీపావళి షాపింగ్​తో  మార్కెట్లు కిటకిట.. కొవిడ్ రూల్స్​ గాలికి..

దీపావళికి ముందు దేశవ్యాప్తంగా మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు కరోనా ఆంక్షలను విస్మరించి రోడ్లపైకి తరలివచ్చారు. మాస్కు ధరించటం, భౌతిక దూరం గాలికి వదిలేసి అధిక సంఖ్యలో గుమికూడారు.

covid rules
కొవిడ్ రూల్స్

By

Published : Oct 31, 2021, 9:09 PM IST

కొవిడ్ రూల్స్

పండగసీజన్​ నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా మార్కెట్లు, షాపింగ్​మాల్స్ రద్దీగా మారాయి. ప్రజలు కొవిడ్​-19 నిబంధనలు ఉల్లంఘించి అధిక సంఖ్యలో బయటకు వచ్చారు. దిల్లీలోని సదర్ బజార్, లజ్​పథ్​ నగర్​ జనసంద్రాన్ని తలపిస్తోంది. కొవిడ్ ఆంక్షలను లెక్కచేయకుండా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో ప్రధాన నగరాల్లో కొద్దిసేపు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

రద్దీగా మార్కెట్లు
కొవిడ్ రూల్స్ ఉల్లఘించి

మాస్కు ధరించటం, భౌతికదూరం పూర్తిగా గాలికొదిలారు. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఇలా అధిక సంఖ్యలో ప్రజలు బయటకు రావటం ఇదే తొలిసారని మార్కెట్ వర్తకులు తెలిపారు.

రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం
దీపావళి సందర్భంగా మధ్యప్రదేశ్​ ఇండోర్ లోని రాజ్​వాడా మార్కెట్​కు ప్రజలు తరలివచ్చారు. అటు తమిళనాడు చెన్నైలోని టీ నగర్​లో ప్రజలు అధిక సంఖ్యలో రోడ్లపైకి వచ్చి షాపింగ్​ చేశారు.

ఇదీ చూడండి:కొవిడ్ ఆంక్షల అమలుపై షాకింగ్ సర్వే- థర్డ్ వేవ్ తప్పదా?

ABOUT THE AUTHOR

...view details