తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​కు వేధింపులు.. కారుతో ఈడ్చుకెళ్లిన వ్యక్తి - person dragged chairperson of woman commission

దిల్లీ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ను.. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్​ వేధింపులకు గురిచేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం 10, 15 మీటర్ల దూరం వరకు కారుతో ఈడ్చుకెళ్లాడు. గురువారం ఈ ఘటన జరిగింది.

delhi-women-commission-chairperson-swati-maliwal-molested-dragged-from-car
దిల్లీ మహిళ కమీషన్ చైర్​పర్సన్​కు వేధింపులు

By

Published : Jan 19, 2023, 4:31 PM IST

Updated : Jan 19, 2023, 7:08 PM IST

దిల్లీ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ స్వాతి మలివాల్​ను 10, 15 మీటర్ల దూరం వరకు కారుతో ఈడ్చుకెళ్లాడు ఓ పోకిరి. మద్యం మత్తలో ఉన్న ఓ కారు డ్రైవర్​ ఆమె​ను వేధింపులకు గురిచేసి, అసభ్యంగా ప్రవర్తించాడు. దిల్లీలో మహిళల భద్రతను పరిశీలించేందుకు అర్ధరాత్రి బయటకు వెళ్లిన స్వాతి మలివాల్​పై..ఈ దారుణం జరిగింది. దేశ రాజధానిలో మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​కే రక్షణ లేకపోవడంపై పలువురు ఆందోళలను వ్యక్తం చేస్తున్నారు.

నిందితుడిని హరీశ్​ చంద్ర(47)గా పోలీసులు గుర్తించారు. అతడు దక్షిణ దిల్లీలోని సంగం విహార్‌కు చెందిన వ్యక్తి. గురువారం వేకువజాముకు ముందు 2.45 గంటల ప్రాంతంలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎయిమ్స్ రెండో నెంబర్ గేట్​ వద్ద మలివాల్, ఆమె బృందంతో కలిసి నిల్చుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన నిందితుడు.. మలివాల్​తో​ దురుసుగా మాట్లాడాడు. తెల్లకారులో వచ్చిన హరీశ్.. కారెక్కి పక్కన కూర్చోమన్నాడు. సైగలు చేస్తు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని స్వాతి మలివాల్ మందలించారు.

అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన హరీశ్.. కొద్దిసేపటికి మళ్లి తిరిగొచ్చాడు. మళ్లీ అదే తరహాలో వేధింపులకు గురిచేశాడు. దీంతో మలివాల్ అతని కారు డోర్​ వద్దకు వెళ్లి.. పట్టుకుంనేందుకు ప్రయత్నించారు. అప్పుడే కారు అద్దాలు పైకి ఎక్కించాడు నిందితుడు. దీంతో ఆమె చేతులు కారు డోర్​కు, అద్దాలకు మధ్య చిక్కుపోయాయి. అనంతరం ఆమెను 15 మీటర్ల వరకూ ఈడ్చుకుంటూ వెళ్లాడు నిందితుడు. ఘటనలో మలివాల్​కు స్పలంగా గాయలయ్యాయి. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ జరుపుతున్నట్లు వారు వెల్లడించారు.

"నేను నా బృందం దిల్లీలో మహిళల భద్రత పరిస్థితిని పరిశీలిస్తున్నాం. మద్యం మత్తులో ఉన్న ఓ కారు డ్రైవర్ నన్ను వేధించాడు. నేను అతడికి పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు.. అతను కారు డోరు అద్దాలు వేశాడు. దీంతో నా చేయి ఇరుక్కుపోయింది. అనంతరం అతడు ఈడ్చుకుంటూ వెళ్లాడు. దేవుడే నా ప్రాణాలను రక్షించాడు. దిల్లీలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సురక్షితంగా లేకుంటే మిగతా వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు" అని మలివాల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Last Updated : Jan 19, 2023, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details