దిల్లీలో దారుణ హత్య జరిగింది. (Delhi Murder news) ద్వారకా జిల్లాలోని డాబ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ గొంతు కోసి చంపాడు (Delhi Woman Murdered) ఓ దుండగుడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. (Murder for Cigarette)
మృతురాలు విభా(30) అదే ప్రాంతంలో చిన్న జనరల్ స్టోర్ నడుపుతోందని పోలీసులు తెలిపారు. నిందితుడు దీపక్.. తప్పతాగి దుకాణం దగ్గరికి వచ్చి ఫ్రీగా సిగరెట్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. (Murder for Cigarette) ఇందుకు మహిళ నిరాకరించింది. దీంతో మహిళతో దీపక్ వాగ్వాదానికి దిగాడని పోలీసులు చెప్పారు. క్రమంగా ఇది ఘర్షణగా మారిందని, పారిపోయేందుకు ప్రయత్నించిన మహిళను నిందితుడు కిరాతకంగా చంపేశాడని వివరించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధరించారని వెల్లడించారు.
చితకబాదిన స్థానికులు