తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ హింస: 1700 వీడియో క్లిప్స్​ సేకరించిన పోలీసులు - 1,700 video clips and CCTV footage

దిల్లీ హింసకు సంబంధించి 1700 వీడియో క్లిప్స్​, సీసీటీవీ ఫుటేజ్​లను పోలీసులు సేకరించారు. నేరస్థులను గుర్తించేందుకు ఫోరెన్సిక్​ నిపుణుల సహాయం తీసుకుంటున్నామని దిల్లీ క్రైం బ్రాంచ్ జాయింట్ కమిషనర్ బీకే సింగ్ శనివారం ​తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించిన 9 కేసులపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.

Delhi violence: Police receive 1700 video clips & CCTV footage, examining dump data of phone calls
దిల్లీ హింస: 1700 వీడియో క్లిప్స్​ను సేకరించిన పోలీసులు

By

Published : Jan 30, 2021, 11:11 PM IST

దిల్లీ హింసకు సంబంధించి కీలకమైన 1700 వీడియో క్లిప్పింగ్స్​ను, వీడియో ఫుటేజ్​లను దిల్లీ పోలీసులు సేకరించారు. వీటి ద్వారా నేరస్థులను గుర్తించేందుకు ఫోరెన్సిక్​ నిపుణల సహాయం తీసుకుంటున్నామని దిల్లీ క్రైం బ్రాంచ్ జాయింట్ కమిషనర్ బీకే సింగ్ శనివారం ​తెలిపారు.

వీడియో క్లిప్స్​పై విచారణ జరిపేందుకు జాతీయ ఫోరెన్సిక్​ సైన్సెస్​కు చెందిన బృందానికి సమాచారం ఇచ్చామని తెలిపారు. దిల్లీ హింసకు సంబంధించి సమాచారం, వీడియో క్లిప్పింగ్స్ ఉంటే తమకు ఇవ్వాలంటూ వార్తాపత్రికల ద్వారా ప్రజలకు శుక్రవారం అప్పీల్ చేశారు దిల్లీ పోలీసులు.

దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు ఎర్రకోటను శనివారం సందర్శించారు.

ఇదీ చదవండి :దిల్లీలో పోలీసు కుటుంబాల నిరసన ప్రదర్శన!

ABOUT THE AUTHOR

...view details