దిల్లీ విశ్వవిద్యాలయం 97వ స్నాతకోత్సవంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారి 1,78,719 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు డిజిటల్ రూపంలో డిగ్రీలను అందజేసింది దిల్లీ వర్సిటీ. భవిష్యత్లో పీహెచ్డీ విద్యార్థులకు సైతం ఇలానే డిజిటల్ విధానంలో డిగ్రీలు అందిస్తామని వర్సిటీ ప్రొఫెసర్ డీఎస్. రావత్ 'ఈటీవీ భారత్' కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 156 మందికి పతకాలను, 36 మందికి బహుమతులను అందించారు. దాదాపు 600 పైగా పీహెచ్డీ విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు.