తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శిర్డీకి వెళ్లాల్సిన విమానం దారి మళ్లింపు.. ప్రయాణికుల ఆగ్రహం! - స్పైస్​జెట్ విమానం బ్యాడ్ వెదర్

SpiceJet plane diverted: దిల్లీ నుంచి శిర్డీకి వెళ్లాల్సిన స్పైస్​జెట్ విమానం.. వాతావరణం అనుకూలించక ముంబయిలో ల్యాండ్ అయింది. ఈ క్రమంలో ప్రయాణం ఐదు గంటలు ఆలస్యమైందని సమాచారం. దీనిపై ప్రయాణికులు కొందరు అసహనం వ్యక్తం చేశారు.

SpiceJet plane diverted
SpiceJet plane diverted

By

Published : May 20, 2022, 4:57 AM IST

SpiceJet plane diverted: దిల్లీ- శిర్డీ మధ్య ప్రయాణించే స్పైస్​జెట్ విమానాన్ని ముంబయికి మళ్లించారు. వాతావరణం అనుకూలించని కారణంగా.. విమానాన్ని ముంబయి విమానాశ్రయంలో దింపినట్లు స్పైస్​జెట్ వెల్లడించింది. ఈ క్రమంలో, ప్రయాణం ఐదు గంటలు ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.

ఎస్​జీ 953 అనే విమానం.. దిల్లీ నుంచి గురువారం మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరింది. శిర్డీకి సాయంత్రం 4.50 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించక ముంబయిలో విమానాన్ని దింపేశారు. విమానంలోని ప్రయాణికులు శిర్డీ వెళ్లేందుకు రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు స్పైస్​జెట్ వెల్లడించింది. ప్రయాణికుల సంరక్షణే తమ తొలి బాధ్యత అని పేర్కొంది.

కాగా, ఈ ఘటనపై పలువురు ప్రయాణికులు.. విమాన సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు కొందరు ప్రయాణికులు సోషల్​మీడియాలో వీడియోలు అప్​లోడ్ చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details