తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Delhi Services Bill 2023 : 'దిల్లీ​ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం.. అమల్లోకి డేటా ప్రొటెక్షన్‌ చట్టం

Delhi Services Bill 2023 : దిల్లీ సర్వీస్​ బిల్లు చట్టరూపం దాల్చింది. నేషనల్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటితో పాటు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, జనన మరణాల నమోదు సవరణ బిల్లు, జన్ విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లులపై కూడా రాష్ట్రపతి సంతకం చేశారు.

delhi-services-bill-adelhi-services-bill-2023
delhi-services-bill-2023

By

Published : Aug 12, 2023, 12:58 PM IST

Updated : Aug 12, 2023, 1:51 PM IST

Delhi Services Bill 2023 : వివాదాస్పదమైన 'దిల్లీ సర్వీసుల బిల్లు' (జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు-2023) చట్టంగా మారింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో దిల్లీ సర్వీసుల చట్టంగా మారింది. వీటితో పాటు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, జనన మరణాల నమోదు సవరణ బిల్లు, జన్ విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లులపై కూడా రాష్ట్రపతి సంతకం చేశారు.

Delhi Services Bill Details :దేశ రాజధాని దిల్లీలో ఐఏఎస్‌లు సహా ఇతర ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని 2023 మేలో.. సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన మరుసటి రోజే దిల్లీలో అధికారుల బదిలీలపై ఓ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది కేంద్రం. గ్రూప్‌ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలపై నిర్ణయాలు తీసుకునేందుకు జాతీయ రాజధాని సివిల్‌ సర్వీస్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి దిల్లీ సీఎం ఛైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.

వీరిలో ముఖ్యమంత్రి మినహా మిగిలిన ఇద్దరు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకే ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌లో ఉంది. వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే లెఫ్టినెంట్ గవర్నర్​దే తుది నిర్ణయమని ఆర్డినెన్స్​లోఉంది. దీని ప్రకారం అధికారమంతా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఈ ఆర్డినెన్స్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్‌ స్థానంలో చట్టం తీసుకొచ్చేలా.. ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ 'దిల్లీ సర్వీసుల బిల్లు'ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లును విపక్ష కూటమి 'ఇండియా'తీవ్రంగా వ్యతిరేకించింది. తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లుకు ఆమోదం లభిచింది. తాజాగా రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టంగా మారింది.

అమల్లోకి డేటా ప్రొటెక్షన్‌ చట్టం..
Data Protection Bill 2023 :దిల్లీ సర్వీసుల బిల్లుతో పాటు డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్ బిల్లు, జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు, జన్‌ విశ్వాస్‌ (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లులు కూడా చట్టంగా మారాయి. దేశ పౌరుల డిజిటల్‌ హక్కులను బలోపేతం చేయడం, వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కొరడా ఝుళిపించేందుకు డేటా ప్రొటెక్షన్‌ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. డేటా ప్రొటెక్షన్‌ ప్రకారం ఇకపై డిజిటల్‌ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా.. సమాచార దుర్వినియోగానికి పాల్పడినా సదరు కంపెనీలపై కనిష్ఠంగా రూ.50కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.250 కోట్ల వరకు జరిమానా విధించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.

దిల్లీ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం.. అవినీతి రహిత పాలన కోసమే చట్టమన్న అమిత్ షా

'దిల్లీ బిల్లు'కు లోక్​సభ పచ్చజెండా.. ప్రజల మంచికోసమే చట్టమన్న అమిత్ షా.. వెన్నుపోటు అంటూ కేజ్రీ ఫైర్

Last Updated : Aug 12, 2023, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details