జామియా అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి షార్జీల్ ఇమామ్‌కు దిల్లీ సాకేత్ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా తేల్చింది. కాగా, షార్జీల్ మరికొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్న కారణంగా జైల్లోని ఉండాల్సి ఉంటుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు షార్జీల్ ఇమామ్‌ను దిల్లీ పోలీసులు డిసెంబర్ 13న అరెస్టు చేశారు.
జామియా అల్లర్ల కేసు.. షార్జీల్ ఇమామ్‌ను నిర్దోషిగా ప్రకటించిన దిల్లీ కోర్టు - Delhi Saket Court Judgments
షార్జీల్ ఇమామ్‌కు దిల్లీ సాకేత్ కోర్టులో ఊరట లభించింది. జామియా హింసకాండ కేసులో ఆయన నిర్దోషిగా తేల్చింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు షార్జీల్ ఇమామ్‌ను దిల్లీ పోలీసులు 2019 డిసెంబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా డిసెంబర్ 15న జామియా విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీ హింసాయుతమైంది. ఈ అల్లర్లలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగం చేసిన రెండు రోజుల తర్వాత జామియా విద్యార్థులు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో ఈ ర్యాలీ చేశారు. అప్పుడు పోలీసులపై విద్యార్థులు దాడి చేశారు. అల్లర్లకు పాల్పడ్డవారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భారత్ నుంచి అసోం, ఈశాన్య రాష్ట్రాలను విడదీయాలంటూ జాతి వ్యతిరేకంగా షార్జీల్ ప్రసంగించాడు. కానీ తర్వాత ఆ వ్యాఖ్యలను అతడు సమర్థించుకున్నాడు.