గణతంత్ర దినోత్సవానికి దేశరాజధాని దిల్లీ పరిసరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఉత్సవాలు జరిగే రాజ్‌పథ్‌తో పాటు రాష్ట్రపతి భవన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణకాంతులను వెదజల్లుతున్నాయి.
గణతంత్ర దినోత్సవానికి హస్తిన ముస్తాబు - republic day latest update
రిపబ్లిక్ డే ఉత్సవాలకు దేశరాజధాని సిద్ధమైంది. వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రాజ్‌పథ్ వద్ద నిర్వహించే పరేడ్‌లో భారత్ తన సైనిక శక్తిని ప్రదర్శించనుంది.
రాజ్‌పథ్‌లో జరిగే పరేడ్‌లో కీలక సైనిక సంపత్తిని భారత్ ప్రదర్శించనుంది. అత్యాధునిక టీ-90 యుద్ధ ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణులను సైనిక బలగాలు ప్రదర్శించనున్నాయి. వీటితో పాటు బీఎంపీ-2, పినాక బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకోనున్నాయి. తొలిసారి రఫేల్ యుద్ధ విమానాలు పరేడ్‌లో భాగస్వామ్యం కానున్నాయి.
బంగ్లాదేశ్‌కు చెందిన సాయుధ దళాల కవాతు, బ్యాండ్ బృందం తొలిసారి భారత గణతంత్ర వేడుకల్లో భాగం కానున్నాయి. ఇరుదేశాల మధ్య ఉన్న దృఢమైన బంధానికి ప్రతీకగా బంగ్లాదేశ్ బలగాలు ప్రదర్శన చేయనున్నాయి. కొవిడ్ నిబంధనల దృష్ట్యా ఈ సారి మోటార్ సైకిల్ ప్రదర్శన నిర్వహించం లేదు.