దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. దేశ రాజధానిలో కొత్త కరోనా కేసులు 100 కంటే తక్కువ ఉండటం గమనార్హం. దిల్లీలో సోమవారం కొత్తగా 89 కేసులు(Covid Cases) మాత్రమే నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 0.16 శాతంగా నమోదైంది. ఫిబ్రవరి 16 తర్వాత దిల్లీలో 100లోపు కొవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
Covid Cases : దిల్లీలో కొత్తగా 89 కరోనా కేసులు - కరోనా కేసుల సంఖ్య
దేశవ్యాప్తింగా కొవిడ్ వ్యాప్తి తగ్గుతోంది. దిల్లీలో కొత్తగా 89 కేసులు(Covid Cases) మాత్రమే నమోదయ్యాయి. అత్యధికంగా కేరళలో 7,499 కేసులు బయటపడ్డాయి.
covid cases : దిల్లీ కొత్తగా నమోదైన కేసులు 100లోపే!
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- కేరళలో కొత్తగా 7,499 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 13,596 మంది కోలుకోగా, 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
- తమిళనాడులో కొత్తగా 7,427 కేసులు నమోదయ్యాయి. 15,281 మంది కోలుకోగా, 189 మంది మృతిచెందారు.
- మహారాష్ట్రలో కొత్తగా 6,270 కేసులు బయటపడ్డాయి. 13,758 మంది డిశ్చార్జ్ కాగా, 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కొత్తగా 4,867 కేసులు నమోదు కాగా.. 8,404 మంది డిశ్చార్జి అయ్యారు. 142 మంది మృతిచెందారు.
ఇదీ చదవండి :' రెండో దశలో కరోనా మరణాలు 15లక్షల కంటే అధికం'