ఆందోళన కలిగించే వైట్ ఫంగస్(White fungus) కేసు ఒకటి దిల్లీలో బయటపడింది. రోగి శరీరంలోని పేగులు, ఆహారవాహిక(ఎసోఫాగస్)కు వైట్ ఫంగస్ సోకింది. సర్ గంగారాం ఆస్పత్రి(Sir Ganga Ram Hospital)లో ఓ మహిళా రోగికి ఈ వ్యాధి నిర్ధరణ అయింది.
తీవ్రమైన కడుపు నొప్పితో మహిళ మే 13న ఆస్పత్రిలో చేరిందని ఆస్పత్రి వైద్యుడు అనిల్ అరోరా తెలిపారు. గతేడాది డిసెంబర్లో రొమ్ముక్యాన్సర్ బారిన పడిన ఆమె చికిత్స తీసుకుంటున్నారని.. నాలుగు వారాల క్రితం వరకు ఆమెకు కీమోథెరపీ జరిగిందని చెప్పారు.
"స్టెరాయిడ్లు వాడటం మూలాన ఓ వైట్ ఫంగస్ కేసు నమోదైంది. ఆహార నాళానికి, పెద్ద పేగు, చిన్నపేగులకు వైట్ ఫంగస్ సోకడం.. కొవిడ్(covid-19) వెలుగుచూసిన తర్వాత ఇదే తొలిసారి. మహిళలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంది. నాలుగు వారాల క్రితం ఆమెకు కీమోథెరపీ జరిగింది. ప్రతికూల ప్రభావానికి ఇదీ ఓ కారణం అయి ఉండొచ్చు."