ఇటీవల కాలంలో హత్యాచార ఘటనలు (Rape statistics in India) దేశ ప్రజల్ని కలవరపెడుతున్నాయి. ఈ సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ)(NCRB report 2020) పలు కీలక విషయాలు వెల్లడించింది. అత్యాచారాలు, హత్యల్లో మెట్రో నగరాల్లో జరుగుతున్న నేరాలను బయటపెట్టింది. గణాంకాల పరంగా.. దేశ రాజధాని నగరం దిల్లీనే మహిళలకు అంత సురక్షితం కాదనే విషయాన్ని నిగ్గు తేల్చింది.
కొవిడ్, లాక్‌డౌన్లతో సతమతమైన 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,533 అత్యాచార(India crime news), 1,849 హత్య ఘటనలు(india crime rate 2020) వెలుగులోకి వచ్చాయి. వాటిలో దాదాపు 40 శాతం అత్యాచార, 25 శాతం హత్య కేసులు(Rape statistics in India) ఒక్క దిల్లీలోనే నమోదయ్యాయి. 20 లక్షల జనాభా కలిగిన 19 మహానగరాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రభుత్వం ఈ లెక్కలను వెలువరించింది. హత్య కేసుల్లో తర్వాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నై, ముంబయి, సూరత్ ఉన్నాయి. అయితే ముందు సంవత్సరంతో పోల్చితే నేరాల రేటు కాస్త తగ్గిందని ఆ నివేదిక పేర్కొంది.