దేశంలో కొవిడ్ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ, మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. మరోవైపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ కొవిడ్ ఉద్ధృతి అధికంగా కనిపిస్తోంది. దిల్లీలో కొత్తగా 7,053 మందికి కొవిడ్ సోకింది. 104 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,67,028కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7,332కి పెరిగింది.
- కేరళలో అత్యధికంగా 5,537 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 77,813. ఇప్పటివరకు వైరస్ నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 4,28,529.
- గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 4,496 మంది కరోనా బారినపడ్డారు. 112 మంది మరణించారు. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 17,36,329గా, యాక్టివ్ కేసుల సంఖ్య 84, 627గా నమోదైంది. ఇప్పటివరకు 16,05,064 మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారు.
- బంగాల్లో కొత్తగా 3,856 కరోనా కేసులు వెలుగుచూశాయి. 54 మంది వైరస్‌కు బలయ్యారు. ఫలితంగా మొత్తం కేసులు 4,20,840కి పెరగ్గా మృతుల సంఖ్య 7,506గా నమోదైంది. ప్రస్తుతం 32,185 యాక్టివ్ కేసులున్నాయి.
- రాజస్థాన్‌లో కొత్తగా 2,176 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,19,327కు చేరింది. చివరి 24 గంటల్లో 13 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 2,032కు పెరిగింది. ప్రస్తుతం 17,352 యాక్టివ్ కేసులున్నాయి.
- తమిళనాడులో తాజాగా 2,112 మందికి కొవిడ్ సోకింది. 25 మంది మృతిచెందారు. దీంతో, మొత్తం కేసులు సంఖ్య 7,52,521కి చేరింది. రాష్ట్రంలో 18,395 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 11,440 మంది వైరస్ కారణంగా మృతిచెందారు.