కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. గణతంత్ర దినోత్సవం రోజున రైతన్నలు చేపట్టిన పరేడ్‌తో దిల్లీ దద్దరిల్లింది. తీవ్ర హింసాత్మకంగా మారిన ఈ ఘటనలో.. భారీ ర్యాలీ చేపట్టిన నిరసనకారుల బృందం ఎర్రకోట ఎక్కి రైతన్నల జెండాను ఎగురవేశారు.
ఈ ట్రాక్టర్ ర్యాలీలో ఎర్రకోట ప్రాంతం చెల్లాచెదురైంది. అక్కడి వాహనాలు ధ్వంసమవడం సహా.. మరికొన్ని వాహనాలు బోల్తా పడ్డాయి. అక్కడి టికెట్ కౌంటర్‌పై దాడిచేయడం వల్ల.. అందులోని దస్త్రాలు, ఇతర కాగితాలు చిందరవందరగా పడిఉన్నాయి. సమీపంలోని మెడికల్ డిటెక్టర్ గేట్ వద్ద గాజు ముక్కలు, పోలీసుల టోపీలు కనిపిస్తున్నాయి.