తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో 14 ఏళ్ల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు - దిల్లీని వణికిస్తున్న చలి పులి

పశ్చిమ హిమాలయాల నుంచి వీస్తున్న చల్లటి గాలుల ప్రభావంతో దేశ రాజధాని దిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. శుక్రవారం ఉష్ణోగ్రతలు ఏకంగా 7.5 డిగ్రీలుగా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

Delhi Temperatures down to 14 Years low
దిల్లీలో అత్యల్ప ఉష్ణగ్రతలు

By

Published : Nov 20, 2020, 12:20 PM IST

దేశ రాజధాని దిల్లీని చలి వణికిస్తోంది. నగరంలో శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలు ఏకంగా 7.5 డిగ్రీలకు పడిపోయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్​లో ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో పడిపోవడం గత 14 ఏళ్లలో ఇదే ప్రథమమని తెలిపింది. శనివారం వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండొచ్చని అంచనా వేసింది. ఈ పరిస్థితి మరో 24 గంటలు కొనసాగితే కోల్డ్​ వేవ్(శీతల గాలులు వీయడం) పరిస్థితిని ప్రకటించనున్నట్లు పేర్కొంది.

నవంబర్ నెలకు గాను దిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు.. గత ఏడాది 11.5 డిగ్రీలు, 2018లో 10.5 డిగ్రీలు, 2017లో 7.6 డిగ్రీలుగా నమోదయ్యాయి.

1938 నవంబర్​ 28న దిల్లీలో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 3.9 డిగ్రీలకు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి:ఔషధ వ్యవస్థ అనుసంధానాన్ని తప్పుబట్టిన ఐఎంఏ

ABOUT THE AUTHOR

...view details