Delhi rape news:దిల్లీలో దారుణ ఘటన జరిగింది. దివ్యాంగ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని మౌజ్పుర్కు చెందిన రెహాన్(34)గా గుర్తించారు.
నవంబర్ 21 నుంచి బాధితురాలిపై నిందితుడు అత్యాచారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. రెహాన్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించిందని వెల్లడించారు.
బాధిత మహిళ.. తన తల్లి, సోదరి సహాయంతో డిసెంబర్ 5న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలు చెవిటి, మూగ కావడం వల్ల స్టేట్మెంట్ రికార్డు చేయడం కష్టమైందని పోలీసులు తెలిపారు. దిల్లీ మహిళా కమిషన్ బాధితురాలికి న్యాయసహాయం అందించిందని, దివ్యాంగుల సంజ్ఞలను అర్థం చేసుకొనే ప్రైవేటు నిపుణుడిని పిలిపించి స్టేట్మెంట్ నమోదు చేశామని వివరించారు.
Delhi crime news: