తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్ల్​ఫ్రెండ్స్​తో ఎంజాయ్​ చేసేందుకు ప్లాన్​!.. విమానంలో బాంబు ఉందని బెదిరింపు కాల్​.. చివరకు.. - అమ్మాయిల కోసం ఫ్లైట్​ఆపాలని బాంబు బెదిరింపు

గర్ల్​ఫ్రెండ్స్​తో ఎక్కువ సేపు మాట్లాడాలని విమానంలో బాంబు ఉందని బెదిరింపు కాల్​ చేశాడో యువకుడు. అప్రమత్తమై తనిఖీ చేసిన ఎయిర్​పోర్టు సిబ్బందికి అనుమానాస్పదంగా ఏం లభించలేదు. దీంతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?

delhi pune spicejet flight hoax call
delhi pune spicejet flight hoax call

By

Published : Jan 14, 2023, 12:27 PM IST

గర్ల్​ఫ్రెండ్స్​ కోసం విమానం ఆపడానికి అందులో బాంబు ఉందని బెదిరింపు కాల్​ చేశాడో యువకుడు. ఈ విషయం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని(ఐజీఐ) స్పైస్​జెట్​ కాల్​ సెంటర్​కు ఫోన్​ చేసి చెప్పాడు. దీంతో అధికారుల ఆ విమానాన్ని ఖాళీ చేయించి.. క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ అందులో అనుమానాస్పదంగా ఏం లభించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్​ కాల్​ చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ద్వారకాకు చెందిన అభినవ్​ ప్రకాశ్​ అనే యువకుడు.. గత ఏడు నెలలుగా గురుగ్రామ్​లోని బ్రిటిష్​ ఎయిర్​వేస్​కు ట్రైనీ టికెటింగ్ ఏజెంట్​గా పనిచేస్తున్నాడు. అతడి చిన్ననాటి స్నేహితులు రాకేశ్​, కునాల్​ షెరావత్ ఇటీవలే మనాలి రోడ్​ ట్రిప్​నకు వెళ్లారు. అక్కడ వారికి ఇద్దరు అమ్మాయిలు పరిచయమయ్యారు. ఆ యువతులు స్పైస్​ జెట్​కు విమానంలో పుణెకు వెళ్లాల్సిఉంది. అయితే, రాకేశ్​, కునాల్​కు అమ్మాయిలతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్​ చేయాలనిపించింది. ఈ విషయాన్ని ప్రకాశ్​కు చెప్పారు. అనంతరం ముగ్గురూ కలిసి ప్లాన్​ వేసి.. స్పైస్​ జెట్​ కాల్​ సెంటర్​కు ఫోన్​ చేశారు. విమానంలో బాంబు ఉందని చెప్పారు. అనంతరం ఎయిర్​పోర్టు అధికారులు తిరిగి కాల్​ చేయగా.. లిఫ్ట్​ చేయలేదు.

ఇదిలా ఉండగా, బాంబు సమాచారం అందుకున్న వెంటనే ఐజీఐ పోలీస్​ స్టేషన్​తో పాటు సీఐఎస్​ఎఫ్​​ కంట్రోల్​ రూమ్​లను అప్రమత్తం చేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సీఐఎస్ఎఫ్​ రంగంలోకి దిగింది. విమానంలో ఉన్న 182 మంది ప్రయాణికులను, సిబ్బందిని, వారి బ్యాగేజ్​లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే అందులో అనుమానాస్పదంగా ఏమీ లభించలేదు. అనంతరం సాంకేతిక నిఘా బృందాల సాయంతో కాల్ ఎక్కడి నుంచి వచ్చిందోనని దర్యాప్తు చేశారు. తర్వాత ఆ నంబర్​​ అభినవ్ ప్రకాశ్​ పేరు మీద ఉందని తెలిసింది. దీంతో పోలీసులు అభినవ్​ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు.
ఈ ఘటనపై డీసీపీ స్పందించారు. ఇద్దరు అమ్మాయిలను కూడా తాము సంప్రదించామని చెప్పారు. విమానం ఆలస్యం అయిన విషయాన్ని మిగతా ఇద్దరు నిందితులు సెలబ్రేట్​ చేసుకున్నారని.. ప్రకాశ్​ అరెస్టైన విషయం తెలిసి పారిపోయారని చెప్పారు. వారి కోసం గాలింపుచర్యలు చేపట్టామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details