జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ.. దేశ రాజధాని ప్రాంతంలోనూ టపాసులు పేల్చారు. తీవ్ర వాయు కాలుష్యం దృష్ట్యా నవంబరు 30వరకూ దిల్లీలో బాణసంచా కాల్చడం, అమ్మకాలను ఎన్జీటీ నిషేధించింది. కానీ రాత్రి కాగానే దిల్లీలోని పలు వీధులు టపాసుల మోతతో దద్దరిల్లాయి.
బాణసంచా కాల్చడం సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల దిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగి తీవ్ర స్థాయికి చేరింది. గ్రేటర్ కైలాశ్, గోవింద్ పురీ, లజపత్నగర్, ఆర్కే పురం ప్రాంతాల్లో వాయు నాణ్యత దిగజారిందని అధికారులు తెలిపారు.
దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ప్రకారం.. ఆనంద్ విహార్, ఎయిర్పోర్ట్ ప్రాంతం, లోధి రోడ్డు, ఐటీఓ తదితర ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ తీవ్రస్థాయికి పడిపోయింది.