మెడికల్ ఆక్సిజన్ నిల్వలు తరిగిపోతున్నా.. అది సకాలంలో అందుతుందనే నమ్మకం లేకపోవడంతో దిల్లీలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ వద్ద రెండు మూడు గంటలకు మాత్రమే సరిపడే ఆక్సిజన్ ఉందని, ఆ తర్వాత రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయంటూ బుధ, గురువారాల్లో పలు ఆసుపత్రుల నుంచి సమాచారం అందగా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
ప్రాణదాతలుగా మారిన దిల్లీ పోలీసులు - ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా
ఆక్సిజన్ నిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రాణవాయువు సరఫరా చేసేందుకు దిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. కొన్ని ఆసుపత్రులకు యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ సిలిండర్లు చేర్చి వందల మంది ప్రాణాలు కాపాడారు.
ప్రాణవాయువు, ఆక్సిజన్ సిలిండర్
ఆక్సిజన్ ట్యాంకర్లు ఏ ప్రాంతంలో ఉన్నాయో తెలుసుకుని వాటికి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. కొన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను యుద్ధప్రాతిపదికన తరలించారు. దీంతో బాత్రా, మ్యాక్స్, ప్రైమస్, మహారాజ అగ్రసేన్, జీవన్, రథి తదితర ఆసుపత్రులకు సకాలంలో ఆక్సిజన్ చేరింది. వందల మంది రోగుల ప్రాణాలను పోలీసులు కాపాడగలిగారు.
ఇదీ చదవండి:పాకిస్థాన్ వెళ్లొచ్చిన 200 మంది యాత్రికులకు కరోనా
Last Updated : Apr 23, 2021, 7:42 AM IST