తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్విట్టర్​ కార్యాలయాల్లో దిల్లీ పోలీసుల సోదాలు - టూల్​ కిట్​ దిల్లీపోలీసులు

దేశ రాజధానిలోని ట్విట్టర్​ కార్యాలయాల్లో దిల్లీ పోలీసులు సోదాలు చేపట్టారు. కొవిడ్​ టూల్​ కిట్​ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

Delhi Police Special Cell teams at Twitter offices in Delhi and Gurgaon in connection with 'toolkit' probe: Officials
ట్విట్టర్​ కార్యాలయాలపై దిల్లీ పోలీసుల సోదాలు

By

Published : May 24, 2021, 8:37 PM IST

Updated : May 24, 2021, 9:52 PM IST

ట్విట్టర్​ ఇండియాకు చెందిన కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది దిల్లీ పోలీసు స్పెషల్​ సెల్​. కొవిడ్​ టూల్​కిట్​ విషయంపై దర్యాప్తులో భాగంగా దిల్లీ, గురుగ్రామ్​లలోని కార్యాలయల్లో తనిఖీలు నిర్వహించింది. అనంతరం ఇందుకు సంబంధించి నోటీసులు అందించింది.

దిల్లీలోని లాడో సరాయ్​, గురుగ్రామ్​లోని ట్విట్టర్​ ఇండియా ఆఫీసుల్లో రెండు బృందాలు సోదాలు చేపట్టినట్లు సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు. కొవిడ్​-19 టూల్​కిట్​పై వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా ట్విట్టర్​కు స్పెషల్​ సెల్​ ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. భాజపా నేత సంబిత్​ పాత్ర చేసిన ట్వీట్​పై క్లారిటీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

పోలీసులకు తెలియని సమాచారం ట్విట్టర్​ వద్ద ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ సమాచారం దర్యాప్తునకు సంబంధించినదిగా పేర్కొన్నారు దిల్లీ పోలీస్​ పీఆర్​ఓ చిన్మోయ్​ బిస్వాల్​.

Last Updated : May 24, 2021, 9:52 PM IST

ABOUT THE AUTHOR

...view details