Narcotic drugs cartel: అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును దిల్లీ స్పెషల్ సెల్ విభాగం అధికారులు ఛేదించారు. కారులో హెరాయిన్‌ను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.40 కోట్లు విలువైన 10 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని మయన్మార్ నుంచి మణిపూర్ మీదుగా భారత్‌లోకి తీసుకువచ్చినట్లు గుర్తించారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
రూ.40 కోట్లు విలువైన హెరాయిన్ సీజ్ - drugs sieze news
drugs seized in delhi: రూ.40 కోట్లు విలువ చేసే హెరాయిన్‌ను సీజ్ చేశారు దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నారు.
రూ.40కోట్లు విలువైన హెరాయిన్ సీజ్
బంగాల్లో బ్రౌన్ షుగర్: బంగాల్ సిలీగుడిలో ప్రత్యేక పోలీసు బృందం సోమవారం రూ.1.10 కోట్లు విలువ చేసే బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఎండీ బాసెద్, అబ్బు కాసెం వద్ద ఈ డ్రగ్స్‌ను గుర్తించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సిలీగుడి మెట్రోల పోలీస్ స్టేషన్, మటిగారా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ఇదీ చదవండి:చెట్టును ఢీకొట్టిన స్కూల్ వ్యాన్.. 19మంది పిల్లలకు గాయాలు
Last Updated : Mar 29, 2022, 11:00 AM IST