దేశ రాజధానిలో ఎర్రకోట వెనుక ఉన్న విజయ్ ఘాట్ సమీపంలో చక్కర్లు కొడుతున్న ఓ డ్రోన్‌ను దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. జాగ్వర్ హైవే గస్తీ బృందం విధుల్లో ఉండగా అక్కడ ఓ డ్రోన్ కనిపించిందని చెప్పారు.
ఎర్రకోట సమీపంలో డ్రోన్ కలకలం - దిల్లీలో డ్రోన్ల దాడి
దేశరాజధానిలోని ఎర్రకోట వద్ద అనుమానితంగా ఎగురుతున్న డ్రోన్‌ను స్వాధీనం చేసుకన్నారు పోలీసులు. ఈ ప్రాంతంలో అనుమతి లేనప్పటికీ దీనిని ఉపయోగించినట్లు గుర్తింంచారు.
డ్రోన్
వెబ్ సిరీస్‌ను చిత్రీకరిస్తున్న ఓ చిత్రబృందం ఈ డ్రోన్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ షూటింగ్‌కు తప్ప డ్రోన్ వాడకానికి వారికి అనుమతి లేదని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో దిల్లీలో డ్రోన్లను నిషేధిస్తూ జులైలో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇవీ చదవండి: