తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎర్రకోట హింస: 20 మంది అనుమానితుల ఫొటోలు విడుదల - 20 మంది చిత్రాలు విడుదల

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన హింసకు సంబంధించి మరో 20 మంది అనుమానితుల ఫొటోలను దిల్లీ పోలీసులు విడుదల చేశారు.

Delhi Police releases photos of 20 more people in connection with R-Day violence at Red Fort
ట్రాక్టర్​ ర్యాలీకి సంబంధించి మరో 20మంది అనుమానితుల ఫొటోలు విడుదల చేసిన దిల్లీ పోలీసులు

By

Published : Feb 20, 2021, 7:52 PM IST

గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ నిందితులను వేగంగా గుర్తించే పనిలో పడింది దిల్లీ పోలీసు విభాగం. ఆరోజు జరిగిన అల్లర్లలో పాల్గొన్న 20 మంది అనుమానితుల చిత్రాలను పోలీసులు శనివారం విడుదల చేశారు.

ఎర్రకోట హింసకు సంబంధించి 20మంది అనుమానితుల ఫొటోలు విడుదల
ఎర్రకోట హింసలో అనుమానితులు

ప్రక్రియ వేగవంతం..

నాటి వీడియోలను క్షుణ్నంగా పరిశీలిస్తూ.. అనుమానంగా కనిపించిన వ్యక్తుల చిత్రాలను విడుదల చేస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వీటి విడుదల ద్వారా అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు.

ఇంతకుముందు.. ఎర్రకోట హింసకు సంబంధించి 200 మంది ఫొటోలను దిల్లీ పోలీసులు విడుదల చేశారు.

ఇదీ చదవండి: 'గణతంత్ర​ పరేడ్​'పై 22 ఎఫ్​ఐఆర్​లు.. భద్రత కట్టుదిట్టం

పక్కా ప్రణాళికతోనే 'ఎర్రకోట' హింస!

ABOUT THE AUTHOR

...view details