పార్లమెంటుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ట్రాక్టర్ మార్చ్‌పై దర్యాప్తు చేపట్టారు దిల్లీ పోలీసులు. పార్లమెంటు ప్రాంగణంలోకి ట్రాక్టర్లకు అనుమతిలేదని పోలీసులు తెలిపారు. జనవరి 26 హింసాత్మక ఘటనల నేపథ్యంలో వాటిపై నిషేధం విధించినప్పటికీ సెంట్రల్ దిల్లీకి ఎలా తీసుకొచ్చారనే అంశాన్ని దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఓ కంటైనర్‌లో రహస్యంగా ట్రాక్టర్లను తరలించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సమాచారం సేకరిస్తున్నారు. పార్లమెంటుకు కొద్ది దూరంలోనే ట్రాక్టర్లను నిలిపి ఉంచి, వాటిని గుర్తుపట్టకుండా బోర్డులను ఏర్పాటు చేసినట్లు తేల్చారు.