కరోనా సోకి ప్రాణాలతో పోరాడుతున్న 200 మంది రోగులకు ఆక్సిజన్ సకాలంలో అందించి వారి ప్రాణాలను కాపాడారు దిల్లీ పోలీసులు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.
పశ్చిమ విహార్‌లోని బాలాజీ ఆసుపత్రిలో సోమవారం రాత్రి ప్రాణవాయువు కొరత ఏర్పడింది. ఉన్న ఆక్సిజన్‌ను కొద్ది గంటలు మాత్రమే రోగులకు అందించే క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. మరోవైపు హరియాణా, ఉత్తరప్రదేశ్ నుంచి ఆసుపత్రికి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లు సరిహద్దుల్లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సరిహద్దులకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి ట్యాంకర్లను పంపించారు. పోలీసు వాహనాలు ఎస్కార్ట్‌గా వస్తుండగా ట్యాంకర్లు హాస్పిటల్ చేరుకున్నాయి.