తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమిత్​ షాతో అజిత్​ డోభాల్​ కీలక భేటీ - Ajit Doval latest news

కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో సమావేశమయ్యారు దిల్లీ పోలీసు కమిషనర్​ ఎస్​ఎన్​ శ్రీవాస్తవ. ఫిబ్రవరిన 6 'చక్కా జామ్​' నిర్వహించడానికి రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ కూడా పాల్గొన్నారు

Delhi Police Commissioner meets Amit Shah
అమిత్​ షాతో అజిత్​ డోభాల్​ కీలక భేటీ

By

Published : Feb 4, 2021, 11:39 PM IST

ఫిబ్రవరి 6న 'చక్కా జామ్​' నిర్వహించడానికి రైతు సంఘాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో భేటీ అయ్యారు దిల్లీ పోలీసు కమిషనర్​ ఎస్​ఎన్​ శ్రీవాస్తవ. పరిస్థితులు అదుపుతప్పకుండా చూసేందుకు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు షాకు వివరించారు కమిషనర్​. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ పాల్గొన్నారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళన చేస్తోన్న దిల్లీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో అల్లర్లు జరిగిన తర్వాత భారీగా భద్రతా దళాలను మోహరించిన అధికారులు.. రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా భారీగా బారికేడ్లు, ఇనుప ఉచలతో పాటు కాంక్రీట్​ నిర్మాణాలు చేపట్టారు.

ఇదీ చూడండి:'చక్కా జామ్​' కోసం రైతులు, పోలీసుల ముమ్మర ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details