తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో కవిత దీక్షకు లైన్‌ క్లియర్‌.. మౌఖికంగా అనుమతులిచ్చిన పోలీసులు

Delhi Police gave permission for MLC Kavitha Deeksha: భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిల్లీ పోలీసులు అనుమతిచ్చారు. సాంకేతిక కారణాలతో పర్మిషన్‌ రద్దు చేస్తున్నట్లు పోలీసులు కవితకు సమాచారం అందించగా.. జాగృతి సంస్థ ప్రతినిధులు పోలీసులతో సంప్రదింపులు జరిపారు. చర్చల అనంతరం బీఆర్‌ఎస్‌ దీక్షకు పోలీసులు ఓకే చెప్పారు. దీంతో జంతర్‌మంతర్‌ వద్ద ఇవాళ కవిత దీక్ష యధావిధిగా జరగనుంది.

ఎమ్మెల్సీ కవితకు దిల్లీ పోలీసుల షాక్‌.. దీక్షకు అనుమతి నిరాకరణ
ఎమ్మెల్సీ కవితకు దిల్లీ పోలీసుల షాక్‌.. దీక్షకు అనుమతి నిరాకరణ

By

Published : Mar 9, 2023, 2:41 PM IST

Updated : Mar 10, 2023, 6:32 AM IST

Delhi Police gave permission for MLC Kavitha Deeksha: మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇవాళ దిల్లీలో నిర్వహించ తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతిచ్చారు. జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షకు సాంకేతిక కారణాలతో పర్మిషన్‌ రద్దు చేస్తున్నట్లు మధ్యాహ్నం పోలీసులు కవితకు సమాచారం అందించారు. దీంతో జాగృతి ప్రతినిధులు పోలీసులతో సంప్రదింపులు జరపగా.. చర్చల అనంతరం దీక్షకు ఓకే చెప్పారు. ఈ మేరకు మౌఖికంగా అనుమతి ఇచ్చారు.

ఎమ్మెల్సీ కవితకు దిల్లీ పోలీసుల షాక్‌.. దీక్షకు అనుమతి నిరాకరణ

పోలీసుల అనుమతి లభించడంతో జంతర్‌ మంతర్‌ వద్ద కవిత దీక్ష యధావిధిగా జరగనుంది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసిన భారత్‌ జాగృతి ప్రతినిధులు.. దాదాపు 6 వేల మంది దీక్షలో కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రేపటి దీక్షలో పాల్గొనేందుకు మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్‌ సహా బీఆర్‌ఎస్‌ మహిళా ప్రతినిధులు దిల్లీకి బయలుదేరారు. అంతకుముందు దీక్షకు అనుమతి రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలపడంతో కవిత తీవ్రంగా స్పందించారు. దీక్ష నిర్వహించుకునేందురు ముందుగా అనుమతిచ్చి.. తర్వాత ఎలా నిరాకరిస్తారని మండిపడ్డారు. తమ దీక్షలో ఎలాంటి మార్పు లేదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ఈ విషయంపై దిల్లీ పోలీసులతో మాట్లాడతామన్న కవిత.. దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరతామని వెల్లడించారు.

''దీక్షకు ముందు అనుమతి ఇచ్చి.. తర్వాత ఎలా రద్దు చేస్తారు. మా దీక్షలో మార్పు లేదు.. కొనసాగుతుంది. జంతర్ మంతర్ వద్ద సగం స్థలమే వాడుకోవాలని పోలీసులు సూచించారు. 5 వేల మంది ధర్నాకు హాజరవుతారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నాం. మేం ధర్నా చేసే ప్రాంతంలో ఇతరులూ ధర్నా చేస్తున్నారని మాకు తెలియదు. అకస్మాత్తుగా ఇతరులు వేరే అంశంపై ధర్నాకు దరఖాస్తు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ధర్నా జరిగే ప్రాంతం ఇతరులకు కాకుండా మొత్తం జాగృతి సంస్థకు కేటాయించాలని కోరాం. దిల్లీ పోలీసులు సహకరిస్తారని భావిస్తున్నాం.'' - కవిత, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, భారత్‌ జాగృతి అధ్యక్షురాలు

బీజేపీ తన హామీని అమలు చేయాలి..: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదించాలని ఎమ్మెల్సీ కవిత గతంలో డిమాండ్‌ చేశారు. ఇందుకోసం రేపు దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేపడతామని ప్రకటించారు. 2014, 2018 ఎన్నికల సమయంలో బీజేపీ తమ మేనిఫెస్టోల్లో రెండు సార్లు హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఇందుకు నిరసనగా దిల్లీలో ఒక రోజు దీక్ష చేపడతామన్నారు. ఇందుకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నామని.. సహకరించాలని కవిత కోరారు.

''త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టాలి. ఆ బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించాలి. ఇదే డిమాండ్‌తో దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఒక రోజు దీక్ష చేస్తున్నాం. ఇందుకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నాం. అందరూ సహకరించాలని కోరుతున్నాం.'' - కవిత

ఇవీ చూడండి..

మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకురావాలి: కవిత

ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం: కవిత

కవితకు పంపినవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు : కేటీఆర్

Last Updated : Mar 10, 2023, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details