అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు దిల్లీ పోలీసులు. 54.2 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న అధికారులు.. దీని విలువ రూ.250 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను అల్తాఫ్ అలియాస్ మెహ్రాజుద్దీన్ దర్జీ, అబిద్ హుస్సేన్ సుల్తాన్, హష్మత్ మొహ్మది, టిఫల్ నౌ ఖేజ్, అబ్దుల్లా నజీబుల్లాలగా గుర్తించారు.
దిల్లీలోని బాట్లా హౌస్ ప్రాంతంలో డ్రగ్ ఫ్యాక్టరీని గుర్తించినట్లు దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం పేర్కొంది. తొలుత కశ్మీర్‌కు చెందిన అల్తాఫ్‌ను పక్కా ప్రణాళికతో 4.5 కిలోల డ్రగ్స్‌తో మే 2 అరెస్టు చేశారు. శ్రీనగర్‌కు చెందిన మరో నిందితుడు అబిడ్ హుస్సేన్ సుల్తాన్ నుంచి 12 కిలోలు, జాకీర్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న అఫ్గానిస్థానీ హష్మత్ మొహ్మదిని అరెస్టు చేసిన అధికారులు.. అతని నుంచి 5 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. హష్మత్ నివాసంతో పేరుతో డ్రగ్స్ ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో 29.5 కిలలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీలో హెరాయిన్లోని వివిధ మాడ్యూళ్లను తయారు చేయడానికి అఫ్గానిస్థాన్ నుంచి కొందరు వస్తున్నట్లు విచారణలో తేలింది.