ట్విట్టర్‌కు మరో షాక్ తగిలింది. అశ్లీల దృశ్యాలను(చైల్డ్ పోర్నగ్రఫీ) ట్విట్టర్లో అనుమతించటంపై పోక్సో చట్టం ప్రకారం దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డార్క్ వెబ్‌కు సంబంధించి ఓ టూల్‌కిట్ కూడా ట్విట్టర్లో ఉన్నట్లు మే 29 తేదీనే జాతీయ బాలల హక్కుల కమిషన్ దిల్లీ పోలీసులకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపింది.
అయితే తమ సంస్థ మొదటి నుంచి ఆన్లైన్ పోర్నోగ్రఫీకి విరుద్ధం అని ట్విట్టర్ అధికార ప్రతినిధి తెలిపారు. చైల్డ్ పోర్నోగ్రఫీని నిర్మూలించేందుకు తాము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. బాలల లైంగిక వేధింపులకు సంబంధించి ఏమైనా పోస్ట్‌లు ఉంటే వాటిని తొలగిస్తామని పేర్కొన్నారు.
డార్క్ వెబ్‌కు సంబంధించి ఓ టూల్‌కిట్ కూడా ట్విట్టర్లో ఉన్నట్లు మే 29న ఓ లేఖలో జాతీయ బాలల హక్కుల కమిషన్ తెలిపింది.