బిహార్ గోపాల్‌గంజ్‌లో జ్యోతి భూషణ్ కుమార్, బబ్లూ కుమార్ ఆర్య మధ్య పరిచయం ఉంది. గతంలో భూషణ్ కుమార్ ఓ ఎంపీకి వ్యక్తిగత సిబ్బందిగా విధులు నిర్వర్తించేవాడు. ఆ సమయంలో అతడికి పార్లమెంట్ పాస్ కూడా ఉండేది. కానీ అది 2019 జనవరి 31తో ముగిసింది. ఓ రోజు భూషణ్‌కు తెలియకుండా అతడి జేబులో నుంచి ఆ పాస్‌ను దొంగిలించాడు. ఆ పాస్‌ను ఓ ఇంటర్నెట్ షాప్‌లో ఎడిట్ చేసి నకిలీది సృష్టించాడు బబ్లూ. ఓ ఎంపీకి వ్యక్తిగత కార్యదర్శిగా పాస్ తయారుచేసుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత.. అధికారుల సిఫార్సులు లేకుండానే బబ్లూ ఆర్య అనే వ్యక్తి పేరుతో పార్లమెట్ పాస్‌ను రూపొందించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు పాస్‌ను ఉపయోగించవచ్చు కాబట్టి భద్రతా పరమైన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని సీనియర్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు.