తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీని విమర్శిస్తూ పోస్టర్లు- 25మందిపై ఎఫ్​ఐఆర్​ - నరేంద్ర మోదీని విమర్శిస్తూ దిల్లీలో పోస్టర్లు

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన ఘటనలో దిల్లీ పోలీసులు 25 మందిపై ఎఫ్ఐఆర్​లు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.

PM Modi
ప్రధాని మోదీ

By

Published : May 16, 2021, 5:44 PM IST

ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ.. పోస్టర్లు అంటించిన ఘటనలో దిల్లీ పోలీసులు 25 మందిపై ఎఫ్ఐఆర్​లు నమోదు చేశారు. 'మా పిల్లలకు ఇవ్వవలసిన వ్యాక్సిన్ లను విదేశాలకు ఎందుకు పంపుతున్నారు మోదీ' అని రాసి ఉన్న పోస్టర్లను దేశ రాజధాని ప్రధాన ప్రదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు.

మోదీని విమర్శిస్తూ పోస్టర్లు అంటిస్తున్నారనే సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతరం వచ్చిన ఫిర్యాదు మేరకు 25 ఎఫ్ఐఆర్​లు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:'ప్రతి పల్లెలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్!'

ABOUT THE AUTHOR

...view details