దిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించటం సరికాదని సుప్రీం కోర్టుకు తెలిపింది కేంద్రం. అందుకు బదులుగా ఉద్యోగులు వాహనాలను షేర్ చేసుకోవటం, ఒకే వాహనంలో ఎక్కువ మంది రావటం వంటి అంశాలను సూచించినట్లు పేర్కొంది. దాని ద్వారా రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య తగ్గుతుందని తెలిపింది. ఉద్యోగుల వాహనాల సంఖ్య తక్కువేనని, వాటిని ఆపటం ద్వారా పెద్దగా ఉపయోగం ఉండదని పేర్కొంది.
కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎయిర్ క్వాలిటీ కమిషన్ మేనేజ్‌మెంట్ సూచనల మేరకు పలు ప్రతిపాదనలతో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. అందులో అత్యవసర సరకుల వాహనాలు మినహా ఇతర ట్రక్కులను దిల్లీలోకి అనుమతించకపోవటం, పాఠశాలలను మూసివేయటం, జీఎన్సీటీఐడీలోని కార్యాలయాల్లో 50 శాతం మాత్రమే హాజరయ్యేలా చూడడం వంటివి ఉన్నాయి. హరియాణా, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ ప్రధాన కార్యదర్శులు సహా ఇతరులతో మంగళవారం జరిగిన సమావేశంలో పలు అంశాలను పరిశీలించినట్లు చెప్పారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.
ఈ క్రమంలో మంగళవారం జరిగిన సమావేశంలోని నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని దిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలకు సూచించింది సుప్రీం. ఈ సందర్భంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థిన క్రమంలో నవంబర్ 24కు వాయిదా వేసింది.
'ప్రతీదీ కోర్టుకే వదిలేస్తున్నారు'