తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Unlock​: మెట్రో కూతలు.. బస్సుల పరుగులు - ముంబయిలో బస్సులు ప్రారంభం

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుతుండగా.. పలు రాష్ట్రాల్లో అన్​లాక్(Unlock) ప్రక్రియ మొదలవుతోంది. రవాణా వ్యవస్థలు ప్రారంభమయ్యాయి. దిల్లీలో 50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ముంబయిలోనూ బస్సు సౌకర్యాలు మొదలయ్యాయి.

metro services resume in delh
అన్​లాక్​తో ప్రారంభమైన రవాణా సౌకర్యాలు

By

Published : Jun 7, 2021, 9:31 AM IST

Updated : Jun 7, 2021, 11:18 AM IST

దేశంలో కరోనా(covid) రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. పలు రాష్ట్రాలు అన్​లాక్​ దిశగా సాగుతున్నాయి. దిల్లీలో నెలన్నర తర్వాత లాక్​డౌన్(lockdown) ఎత్తేయగా.. ప్రజలు తమ పనులను ప్రారంభించారు. రవాణా సదుపాయాలు, మార్కెట్లు మొదలయ్యాయి. 50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి.

50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో నడుస్తున్న మెట్రో రైళ్లు
మెట్రో లోకి వెళుతున్న మహిళ

దిల్లీలో సరి-బేసి విధానంలో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడుస్తున్నాయి.

ప్రారంభమైన వ్యాపారాలు
దిల్లీలో ప్రారంభమైన మార్కెట్లు

దిల్లీలో అన్​లాక్​ ప్రక్రియతో నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వలసకూలీలు చేరుకుంటున్నారు. బస్​ స్టాండ్​లలో, ఫ్లై ఓవర్​ల వద్ద జనం భారీగా దర్శనమిస్తున్నారు. ​

వివిధ ప్రాంతాల నుంచి దిల్లీకి చేరుకుంటున్న ప్రజలు
అన్​లాక్​ ప్రక్రియతో దిల్లీకి చేరుతున్న వలసకూలీలు

మహారాష్ట్రాలోనూ అన్​లాక్​ ప్రక్రియ మొదలైంది. రవాణా సౌకర్యాలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులను చేరవేయడానికి ప్రభుత్వ బస్సులు రోడ్లెక్కాయి. ఈ క్రమంలో బస్సు స్టాప్​ల వద్ద జనం భౌతిక దూరం పాటించకుండానే బారులు తీరారు.

ముంబయిలో ప్రారంభమైన బస్సులు
బస్సు కోసం భౌతిక దూరం పాటించకుండా బారులు తీరిన జనం
బస్సు ఎక్కేప్పుడు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా జనం

ఇవీ చదవండి:'రైళ్లలో టికెట్​ లేకుండా 27 లక్షల మంది ప్రయాణం'

కొవిడ్​ టెస్ట్​ లేకుండానే ఆ ప్రయాణికులకు అనుమతి!

Last Updated : Jun 7, 2021, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details