దిల్లీలోని కరోల్బాఘ్లోని ఓ కాలువలో మంగళవారం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి కాల్ డేటా పరిశీలించిన పోలీసులు.. దాని ఆధారంగా రెండు నంబర్లను ట్రేస్ చేశారు. దీంతో దర్యాప్తులో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అసలేం జరిగింది: దిల్లీలోని కరోల్ కరోల్బాఘ్కు చెందిన విష్ణు అనే వ్యక్తికి రాజ్‌హస్త్‌లోని చురు జిల్లాకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అదే యువతిని విష్ణు స్నేహితుడు సంజయ్ కూడా ఇష్టపడ్డాడు. విష్ణుకు, ఆ యువతికి మధ్య సంబంధం ఉందన్న విషయం తెలుసుకున్న సంజయ్.. దీపావళి రోజు సీతారాం అనే మరో స్నేహితుడితో పాటు విష్ణు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో విష్ణు ఫోన్లో ఆ యువతి ఫొటోలను చూసిన సంజయ్ వాటిని డిలీట్ చేయమని అడిగాడు. అందుకు నిరాకరించగా ఆగ్రహించిన సంజయ్ అతడ్ని గొంతు నులిమి హత్య చేశాడు.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి మృతదేహాన్ని కారులో వేసుకుని దాదాపు రెండు గంటల పాటు నగరంలో తిరిగారు. పండుగ కారణంగా ఎవరికీ వారిపై అనుమానం రాలేదు. కాసేపటి తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేశారు. స్థానికుల సమచారంతో మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. కాల్ డేటాలోని రీసెంట్ నంబర్లను ట్రేస్ చేసి సంజయ్‌తో పాటు సీతారాంను అదుపులోకి తీసుకున్నారు. ఓ వెబ్ సిరీస్‌లోని మర్డర్ సీన్ చూసి ఇలా చంపామని పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు.
భార్య ఆత్మహత్యను చిత్రీకరించిన భర్త..
భార్య ఆత్మహత్యకు పాల్పడుతుంటే ఆమెను కాపాడేందుకు ప్రయత్నించకుండా ఆ దృశ్యాన్ని వీడియో తీసి తన పైశాచికత్వాన్ని చూపించాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పుర్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. శోభిత గుప్తా అనే మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. మొదటి సారి ఆమె విఫలమవ్వగా మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది. ఇది చూసిన ఆమె భర్త తనను రక్షించేందుకు బదులుగా ఆ దృశ్యాన్ని చిత్రీకరించడం ప్రారంభించాడు. ఆమె ఉరి వేసుకుని మృతి చెందిన తర్వాత మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు వచ్చే సరికి ఆమె భర్త సీపీఆర్ చేస్తున్నట్లు నటించాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
పరీక్ష చేసిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. శోభిత కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించగా వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కూతురు గోవాకు వెళ్లిందని..
తన కూతురిని గోవాకు తీసుకెళ్లి, సమాజంలో తమ ఇంటి పరువు పోయేందుకు కారణమైందంటూ ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. మృతురాలి ఇంట్లో దాక్కున్న ఆ వ్యక్తిని కనుగొన్న స్థానికులు అతడ్ని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రయాగ్‌రాజ్‌లోని సంగం నగరంలో పురముఫ్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జగదీశ్ అనే వ్యక్తి ట్రక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడి కూతురు అదే ప్రాంతంలో ఉన్న ఓ బొటిక్‌లో కుట్టు మిషన్ నేర్చుకుంటోంది. అప్పుడే జగదీశ్ కుమార్తెకు, ఆ బొటిక్ యజమానురాలికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. జూన్‌లో బొటిక్ నిర్వాహకురాలితో కలిసి ఆ యువతి గోవా వెళ్లింది. ఇది తెలిసి ఇరుగుపొరుగువారు గుసగుసలు మొదలుపెట్టారు. దీని వల్ల తమ ఇంటి పరువు పోయిందని భావించిన జగదీశ్ తన కుమార్తెను గోవాకు తీసుకెళ్లిన మహిళపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.