తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిగరెట్​ కోసం రూ.10 ఇవ్వలేదని.. యువకుడి దారుణ హత్య - పది రూపాయలకోసం వ్యక్తి హత్య

Man Murder For Ten Rupees: సిగరెట్​ కొనడానికి రూ.10 ఇవ్వనందుకు ఓ యువకుడిని దారుణ హత్య చేశారు నలుగురు కుర్రాళ్లు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితుల్ని అరెస్ట్​ చేశారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది

Delhi man says 'no' to Rs 10 for cigarette, stabbed to death
Delhi man says 'no' to Rs 10 for cigarette, stabbed to death

By

Published : Jun 8, 2022, 11:44 AM IST

Man Murder For Ten Rupees: దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన జరిగింది. సిగరెట్​ కొనుక్కోవడానికి పది రూపాయలు ఇవ్వడానికి నిరాకరించినందుకు ఓ వ్యక్తిని నలుగురు యువకులు దారుణ హత్య చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. బాధితుడిని విజయ్​గా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ ​5న ఈ ఘటన జరిగింది. నలుగురు నిందితులు ఆనంద్​ పర్బత్​ ప్రాంతం నుంచి వస్తున్నారు. ఆ సమయంలో హెచ్​ఆర్​ రోడ్డు వద్ద సిగరెట్​ తాగుతూ కూర్చున్న బాధితుడు విజయ్​ను పది రూపాయలు అడిగారు. అతడు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో నిందితులు.. బాధితుడితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. గొడవ ముదిరి నలుగురు కలిపి విజయ్​ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు.

ABOUT THE AUTHOR

...view details