Man Kills Wife: దిల్లీ శాద్హరా ప్రాంతంలోని గీతా కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి.. తన భార్య, కుమారుడిని హత్య చేశాడు. అనంతరం తాను హత్యకు పాల్పడినట్లు వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్లో వివరాలు షేర్ చేసి పరారయ్యేందుకు యత్నించాడు. శనివారం మధ్యాహ్నం సుమారు 3.40 గంటలకు ఈ ఘటన జరిగింది.
భార్య, కుమారుడి హత్య.. వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేసి మరీ..
Man Kills Wife: శ్వాస ఆడనివ్వకుండా చేసి భార్య, కుమారుడిని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్లో ఈ హత్య వివరాలు షేర్ చేశాడు. దిల్లీలోని శాహ్దరా ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. గీతా కాలనీకి చెందిన సచిన్ స్థానికంగా ఓ కిరాణ షాపును నిర్వహిస్తున్నాడు. అయితే కొంతకాలంగా తీవ్ర నష్టాలు ఎదురవడం వల్ల మానసిక ఒత్తడికి గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం.. భార్య కాంచన్ అరోడాతో (35) గొడవ పడిన సచిన్.. ఆమెకు, కుమారుడికి (15) ఊపిరి ఆడనివ్వకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఈ విషయాన్ని ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. నిందితుడి సమాచారంతో అప్రమత్తమైన బంధువులు ఆ వివరాలను పోలీసులకు అందించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టగా.. సచిన్ ఈ వివరాలు వెల్లడించాడు.
ఇదీ చూడండి :కుమారుడితో ఆడుకుంటూ.. అలల్లో కొట్టుకుపోయిన తండ్రి