తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకా తీసుకున్న వారిలో అయస్కాంత శక్తి- నిజమెంత? - టీకా తీసుకుంటే అయస్కాంత శక్తి

వ్యాక్సిన్​ తీసుకున్నాక తనకు అయస్కాంత శక్తి వచ్చిందంటూ దిల్లీకి చెందిన ఓ వ్యక్తి రూపొందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఇలాంటి సంఘటన మన దేశంలోనే కాదు.. అమెరికాలోనూ జరిగింది. ఓ నర్సు ఏకంగా చట్టసభ కమిటీ ముందే 'అయస్కాంత శక్తి'ని ప్రదర్శించేందుకు ప్రయత్నించింది. ఇంతకీ.. ఈ వాదనల్లో నిజమెంత? నిపుణుల మాటేంటి?

Magnetic powers
మ్యాగ్నెటిక్​ పవర్స్​

By

Published : Jun 10, 2021, 4:01 PM IST

కొవిడ్​-19 వ్యాక్సిన్​ తీసుకున్న వారిలో తలనొప్పి, స్వల్ప అలర్జీలు రావటం సహజమే. కానీ... దిల్లీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం... 'అంతకుమించి' అంటున్నాడు. టీకా తీసుకున్న తర్వాత తనలో అయస్కాంత శక్తి ఉత్పన్నమైందని చెబుతున్నాడు.

దిల్లీలోని జహంగీర్​పుర్​ ప్రాంతానికి చెందిన రాజేశ్​.. తాను మే 15న టీకా తీసుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత ఇనుము వంటి వస్తువులు తన శరీరాన్ని ఆకర్షించటం ప్రారంభమైందని పేర్కొన్నాడు.

అయస్కాంత శక్తి వచ్చినట్లు చెబుతున్న రాజేశ్​

"వ్యాక్సిన్​ తీసుకున్న కొన్ని గంటల తర్వాత నా శరీరంలో అయస్కాంత శక్తి ఉద్భవించింది. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. ఇది కేవలం నేను వ్యాక్సిన్​ తీసుకున్న తర్వాతే జరిగింది" అని పేర్కొన్నాడు. అది నిరూపించేందుకు ఓ వీడియోను సైతం రూపొందించాడు. అందులో కొన్ని వస్తువులను తన శరీరానికి అంటుకున్నట్లు చూపించాడు. తనకు ఇంతవరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని, వైద్యులను సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.

రాజేశ్​

అమెరికాలోనూ..

ఇలాంటి సంఘటన భారత్​లోనే కాదు విదేశాల్లోనూ జరిగింది. టీకా వల్ల అయస్కాంత శక్తి వస్తుందని నిరూపించాలని ప్రయత్నించి ఓ నర్సు అభాసుపాలైంది.

అమెరికాలోని ఒహాయో రాష్ట్రానికి చెందిన జోవన్నా ఓవర్హోల్ట్ అనే నర్సు వ్యాక్సిన్​కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. తనలో మ్యాగ్నెటిక్​ పవర్స్​ అభివృద్ధి చెందినట్లు నిరూపించేందుకు ప్రయత్నించింది. ఒహాయో చట్ట సభ​ హెల్త్​ కమిటీ ముందు.. నేరుగా ప్రదర్శన చేసి చూపించాలనుకుంది. పిన్నులు తన శరీరానికి అంటుకుంటున్నాయని చూపించే ప్రయత్నం చేసి విఫలమైంది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ మారగా.. విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.

అయితే.. ఇలాంటివి జరిగినట్లు ఎక్కడా నిరూపితం కాలేదు. వ్యాక్సిన్లు సురక్షితమని, చిన్న చిన్న దుష్ప్రభావాలు మినహా.. ఎలాంటి మార్పులు కనిపించలేదని అంతర్జాతీయ నిపుణులు, వైద్యులు ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'కొవిడ్​ టీకాతో ఎలాంటి ఇబ్బందుల్లేవ్​..'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details