కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్టు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మే 17 వరకు దిల్లీలో లాక్డౌన్ ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయంలో మెట్రో సేవలు నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు.
కరోనా కట్టికి చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయని తెలిపారు కేజ్రీవాల్. 35శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. గత 2-3రోజుల్లో 23శాతానికి దిగి వచ్చిందని వెల్లడించారు.